ఫ్యామిలీ స్టార్ డీలా పడ్డాడు

ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీయాలంటే దిల్ రాజు తర్వాతే అంటారు అంతా. అలాంటిది. దిల్ రాజు బేనర్ లో 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్‌తో సినిమా అనేసరికి ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు.

Apr 14, 2024 - 16:06
 0
ఫ్యామిలీ స్టార్ డీలా పడ్డాడు

ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీయాలంటే దిల్ రాజు తర్వాతే అంటారు అంతా. అలాంటిది
దిల్ రాజు బేనర్ లో 'ఫ్యామిలీ స్టార్' అనే టైటిల్‌తో సినిమా అనేసరికి ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. బ్యాడ్ టాక్, రివ్యూలతో మొదలై రెండో రోజే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడిందీ సినిమా. తొలి రోజు బ్యాడ్ టాక్ తర్వాత కూడా వసూళ్లు బాగానే ఉండడంతో రాజు ఆశాభావంతో కనిపించారు. వీకెండ్ వరకు బండి బాగానే నడుస్తుందనుకున్నారు. కానీ రెండో రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. దిల్ రాజు ఎంతో శ్రద్ధ పెట్టి పబ్లిసిటీ చేసినా.. స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి ప్రేక్షకుల అభిప్రాయం తెలుసుకుంటూ సినిమాను పుష్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వీకెండ్లోనే నిలబడలేకపోయిన ఈ చిత్రం మంగళవారం ఉగాది సెలవు తర్వాత దాదాపుగా వాషౌట్ అయిపోయిన పరిస్థితి. ఆ రోజు వరకు రాజు కూడా పబ్లిసిటీ పరంగా కొంచెం ఎఫర్ట్ పెట్టారు. కానీ తర్వాతి రోజు నుంచి సినిమా మీద ఆయన ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. రెండో వీకెండ్లో సినిమా పుంజుకునే అవకాశాలు పెద్దగా లేవని అర్థమై ఆయన ఈ సినిమాను పక్కన పెట్టేశారు. తన అన్న కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కిన 'లవ్ మి' మీదికి ఆయన ఫోకస్ మళ్లింది. ఈ నెల 25న ఈ చిత్రం విడుదల కానుంది. తొలి చిత్రం 'రౌడీ బాయ్స్' నిరాశపరచడంతో ఆశిష్ కెరీర్‌కు ఇది చాలా కీలకం. దీన్ని హిట్ చేయడం ఆశిష్‌కే కాదు, తన బేనర్‌కు కూడా చాలా అవసరం. అందుకే రాజు ప్రమోషన్లు గట్టిగా చేసి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాలని చూస్తున్నారు.