ప్రతినిధి-2 మరింత ఆలస్యం

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్.. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే.

Apr 24, 2024 - 15:37
 0
ప్రతినిధి-2 మరింత ఆలస్యం

టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న యంగ్ హీరో నారా రోహిత్.. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి సీక్వెల్ ప్రతినిధి-2 సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాను ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. పదేళ్ల క్రితం ప్రతినిధి కూడా అదే రోజు విడుదలైంది. ఇప్పుడు ప్రతినిధి-2 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రతినిధి-2 కాస్త విరామం తీసుకుంటుందంటూ ట్వీట్ చేశారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.  ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ ఎందుకైందనే విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లోని అనేక డైలాగులు.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నాయి. దీంతో నెట్టింట ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోకపోవడం వల్లే రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సెలవులో ఉన్నారట. అందుకే ప్రతినిధి-2 మూవీ సెన్సార్ పనులు పెండింగ్ లో ఉండిపోయాయని టాక్. అందుకే ఈ చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారని సమాచారం. నారా రోహిత్ ఓ పత్రికా రిపోర్టర్ గా ఈ సినిమాలో కనిపించనున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా సిరీ లెల్ల నటిస్తోంది. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వానరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దినేష్ తేజ్, సప్తగిరి, జిష్షు సేన్‌ గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, ప్రవీణ్, పృథ్వీరాజ్, రఘు బాబు తదితరులు నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.