అందాల రాశి ఖన్నా తెలుగు లో ఊహలు గుసగుసలాడే సినిమాతో అడుగు పెట్టింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే లక్ కలిసి రాకపోవడంతో ఎక్కువ శాతం ఫ్లాప్స్ పడ్డాయి. రాశి ఖన్నా టాలీవుడ్ లో కంటే ఇప్పుడు కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో ఆ మధ్య వరుసగా నటించిన రాశి ఖన్నా ఈ మధ్య తెలుగు ఫిల్మ్ మేకర్స్ ని ఆకర్షించడం లో విఫలం అవుతుంది. టాలీవుడ్ లో దక్కని ఆఫర్లను కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో దక్కించుకుంటూ ఉంది. తమిళనాట ఈ అమ్మడు కెరీర్ ఆరంభం నుంచి సినిమాలు చేస్తూ అక్కడ తనకంటూ ప్రత్యేక గుర్తింపును మరియు క్రేజ్ ని దక్కించుకుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఇటీవలే అడుగు పెట్టింది. హిందీ సినిమాల్లో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. యోధ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫలితం తో సంబంధం లేకుండా మరో ఆఫర్ ను ఈ అమ్మడు దక్కించుకుంది. ఇక ఈమె ది సబర్మతి రిపోర్ట్ సినిమా తో మరోసారి హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతోంది. మొత్తానికి తెలుగులో పెద్దగా ఆఫర్లు లేకున్నా కూడా ఇతర భాషల్లో రాశి ఖన్నా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతుంది. ముందు ముందు కూడా ఈ అమ్మడు అక్కడే ఎక్కువ సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ అమ్మడి జర్నీ దాదాపుగా ముగిసినట్లేనా అనే చర్చ కూడా జరుగుతోంది. మరి లక్ బాగుంటే రాశి టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.