విద్యుత్ లైన్ మెన్ కు ప్రమాదం

Danger to power line men

May 23, 2024 - 14:17
 0
విద్యుత్ లైన్ మెన్ కు ప్రమాదం

నా తెలంగాణ,చెన్నూర్:చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ లైన్ మెన్ కు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే బండారి యోగేశ్వర్ గత మూడురోజుల  క్రితం మంగళవారం పద్మ నగర్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోవడంతో విద్యుత్తు సరఫరా అంతరాయం కలగడం జరిగింది.ట్రాన్స్ ఫార్మర్ ఫీజులు వేసేందుకు లైన్ మెన్ ట్రాన్స్ఫార్మర్ ని ఆఫ్ చేసి కరెంటు స్థంభం పైకి ఎక్కాడు.లైన్ మెన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ ని ఆన్ చేయడంతో లైన్ మెన్ యోగేశ్వర్ ఒక్కసారి విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు.అక్కడే ఉన్న తన సహాయకుడు(ప్రవేట్ హెల్పర్)వెంటనే ట్రాన్స్ఫార్మర్ ని ఆఫ్ చేసి లైన్ మెన్ యోగేశ్వర్ ని స్థంభం పైనుండి క్రిందకిదించి పట్టణ ఆసుపత్రికి తరలించారు.అనంతరం మెరుగైన వైద్య సేవలకోసం కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ఎలక్ట్రికల్ ఇంజనీర్ ని వివరణ కోరగా ప్రమాదంలో లైన్ మెన్ యోగేశ్వర్    చేతికి గాయం అయ్యిందని ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిపారు.గుర్తుతెలియని వ్యక్తి
ట్రాన్స్ ఫార్మర్ ని ఆన్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికే చెన్నూర్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు