టీఆర్పీ పేపర్​ లీక్​ ఘటన వీడుతున్న చిక్కుముడులు

ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షలు నిందితులకు సహకరించిన సీనియర్​ అధికారి 300 మంది అభ్యర్థులు, ఐదుగురు సాల్వర్​ గ్యాంక్​ ముఠా అరెస్ట్​

Mar 17, 2024 - 16:36
 0
టీఆర్పీ పేపర్​ లీక్​ ఘటన వీడుతున్న చిక్కుముడులు

పాట్నా: బిహార్​టీఆర్పీ (టీచర్​ రిక్రూట్​మెంట్​ పేపర్)​ లీక్​ కేసులో బీహార్ ఆర్థిక నేరాల విభాగం, బీహార్ పోలీసులు, జార్ఖండ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో దిమ్మదిరిగే విషయాలు బయటపడ్డాయి. సాల్వర్​ గ్యాంగ్​ ముఠా సభ్యలు ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 300మంది వరకు అరెస్టు చేశామన్నారు. ఐదుగురు ముఠా సభ్యులను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ముఠాకు పలువురు బిహార్​ ప్రభుత్వాధికారులు సహకరించినట్లు ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హజారీబాగ్​ కేంద్రంగా లీక్​కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి సీనియర్​ అధికారి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లీకేజీ నిందితుల నుంచి పలు కీలక పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి పరీక్షా కేంద్ర ప్రవేశ కార్డు, ఒరిజినల్ సర్టిఫికెట్, బ్లాంక్ చెక్, 50 మొబైల్స్, ల్యాప్‌టాప్, ప్రింటర్, పెన్ డ్రైవ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.