మహాయుతి విజయం ఖాయం
మేరా బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మహాయుతిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం మేరా బూత్ సబ్ సే స్ర్టాంగ్ ప్రచార కార్యక్రమం కింద వర్చువల్ గా మహారాష్ర్ట బీజేపీ కార్యకర్తలతో సంభాషించారు. సమాజంలోని ప్రతీ వర్గానికి బీజేపీ సాధికారత కల్పించడంపై తమ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. మహావికాస అఘాడీ, మహాయుతి పాలన మధ్య ఉన్న తేడాను మహా ప్రజలు స్పష్టంగా గమనించారని అన్నారు. రాబోయే ఐదేళ్లపాటు మహాయుతిని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు పార్టీ పటిష్ఠతకు తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. ప్రజాస్వామ్యానికి నిజమైన మార్గదర్శ నిర్దేశకులుగా కార్యకర్తలు నిలుస్తూ, అవిశ్రాంతంగా పనిచేయడంపై అభినందనలు తెలిపారు. పార్టీ విజయానికి రానున్న రోజులు అత్యంత ముఖ్యమైనవని అన్నారు.