జీ–20కి తృణధాన్యాలు ..మిల్లెట్స్ లో నెయ్యితో కిచిడీ తనకిష్టం
సొంత ఊరులాంటిది హరియాణా కుటుంబాలకు రామ్ రామ్ ప్రజాసేవలో కీలక అనుభవం చౌదరీ బన్సీలాల్ సొంతం మిల్లెట్స్ లో నెయ్యితో కిచిడీ తనకిష్టం ఈ కిచిడీకి ప్రపంచాధినేతల ప్రశంసలు ఇక్కడి పంటలకు ప్రపంచంలో భారత్ అంబాసిడర్ కాంగ్రెస్, కూటమివి ద్వంద్వ విధానాలు హరియాణా సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ
హరియాణా: హరియాణా మిల్లెట్ల (తృణధాన్యాలు)ను జీ–20కి పరిచయం చేసి ప్రపంచదేశాధినేతలతో శభాష్ అనిపించానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. హరియాణా ప్రాంతం తన సొంత ఊరులాంటిందన్నారు. ఇక్కడ వేలాది కుటుంబాలతో తనకు అనుబంధం ఉందన్నారు. తాను ప్రతీ ఇంటికి వెళ్లలేను కాబట్టి సభకు వచ్చిన వారంతా హరియాణాలోని ప్రతీ ఇంటికి వెళ్లి మోదీ రామ్ రామ్ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. చౌదరీ బన్సీలాల్ తో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. ఆయనకు ప్రజాసంక్షేమంపై చాలా అనుభవం ఉండేదన్నారు. ఆయనతో తన బంధం చాలా సన్నిహితంగా ఉండేదని మోదీ గుర్తు చేసుకున్నారు. హరియాణా అభివృద్ధికి ప్రజలంతా సమిష్టిగా కలిసి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, అంబాలా,సోనిపట్ లలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. జీ–20లో హరియాణాలో రైతులు పండించిన మినుములను పరిచయం చేశానన్నారు. ఈ సందర్భంగా పలు విదేశాలు ఈ మినుములను (మిల్లెట్స్)ను కొనుగోలు చేసే యోచనలో కూడా ఉన్నాయన్నారు. దీని ద్వారా ఇక్కడి ప్రాంత రైతులకు మేలు చేకూరుతుందన్నారు.
తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనం కోసం ఎంఎస్పీ ప్రకారం ధరలను చెల్లిస్తుందన్నారు. 14 పంటలను కొనుగోలు చేస్తున్నామన్నారు. కాల్వలను అనుసంధానం చేసి రైతులకు నీటిని అందిస్తున్నామన్నారు. మిల్లెట్స్ లో నెయ్యి వేసి తయారు చేసిన కిచిడీ అంటే తనకు ఇష్టమని ప్రధాని పేర్కొన్నారు. ఈ కిచిడీని ప్రపంచాధినేతలు కూడా తింటూ ప్రశంసించారని గుర్తు చేశారు. ఇక్కడి మినుము పంటలకు మోదీ గ్యారంటీ ఇస్తున్నాడన్నారు. అందుకే శ్రీ అన్న అని పేరు పెట్టామన్నారు. మిల్లెట్స్ (తృణధాన్యాల)కు భారత్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదంతా రైతుల శ్రేయస్సు కోసం తాము పడుతున్న తపన అని ప్రధాని పేర్కొన్నారు.
ఇక కాంగ్రెస్, కూటమి పార్టీల విషయానికి వస్తే ఏనాడైనా రైతుల పంటలను నీటి సౌకర్యం, పంటలకు ప్రోత్సాహం, కొనుగోలు చేపట్టారా? అని ప్రశ్నించారు. దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులపై కూడా కాంగ్రెస్ కపటప్రేమ నటిస్తోందన్నారు. మోదీ రూ. 1.25 లక్షల కోట్లు మాజీ సైనికుల ఖాతాల్లో జమ చేశారన్నారు. వారి కుటుంబాలు గౌరవంగా జీవించాలనే తమ ఉద్దేశ్యమన్నారు.
కానీ హరియాణాను దోచుకోవడంలో కాంగ్రెస్ ఏ అవకాశాన్ని వదలలేదని మండిపడ్డారు. ఈ ప్రాంత భూములను సైతం తమ గుప్పిట్లో పెట్టుకొని రైతుల నుంచి తక్కువ ధరలకే కొనుగోలు చేసి మోసం చేశారన్నారు. ప్రభుత్వ భూములను కాజేశారని మండిపడ్డారు. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, రామ మందిర నిర్మాణం, రిజర్వేషన్లు తదితరాలపై కాంగ్రెస్ కూటమి పార్టీలుద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నాయని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.