బంగ్లాలో ఇస్కాన్ దేవాలయంపై దాడి
Attack on ISKCON temple in Bangla
ఢాకా: బంగ్లాదేశ్ లో మరో హిందూ దేవాలయంపై దాడి ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం అర్థరాత్రి ఇస్కాన్ దేవాలయానికి ముష్కరులు నిప్పు పెట్టారు. దీంతో ఆలయం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. వస్తువులన్నీ కాలిపోయాయి. ఇస్కాన్ దేవాలయంలోని లక్ష్మీనారాయణ విగ్రహాం దహనమైంది. ఈ ఆలయం బంగ్లాలోని నమ్ హట్టాలో ఉంది. నిరంతరం హిందువులు, దేవాలయాలపై దాడుల పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది. మాజీ ప్రధాని హసీనా రాజీనామా, వ్యూహాత్మకంగా తాత్కాలిక యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, యూనస్ ప్రభుత్వం ఉగ్రవాదులతో చేతులు కలిపి హిందువులపై దాడులకు పాల్పడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. పాక్, చైనాలతో జతకట్టే ఈ దాడులకు ముష్కరులు దిగుతున్నట్లు భారత ఇంటలిజెన్స్ వద్ద పక్కా సమాచారం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే చిన్మోయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేశారు. కావాలనే హిందువులు, మైనార్టీలపై ప్రతీకార దాడులకు దిగుతున్నారు. బంగ్లా అసాధారణ పరిస్థితులను చల్లార్చేందుకు, హిందువులపై దాడులను నిరోధించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నా ఆ చర్యలు సత్ఫలితాలను సాధించేందుకు మరింత సమయం పట్టేలా గోచరిస్తుంది.