రాహుల్ కు చిక్కులు సుల్తాన్ పూర్ కోర్టులో జూలై 2న హాజరు కావాలని ఆదేశం
అమిత్ షాపై ఆరోపణలు
లక్నో: అమిత్ షాపై హత్యారోపణల కేసులో రాహుల్ గాంధీకి చిక్కులు పెరిగాయి. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా సుల్తాన్ పూర్ కోర్టులో జూలై 2న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. పార్లమెంట్ స్పీకర్ ఎన్నికలు ఉన్నందున రాహుల్ గాంధీ విచారణకు హాజరు కాలేదని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. 2018 మే 8న బెంగళూరు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమిత్ షా హంతకుడని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కాగా 2024 ఫిబ్రవరి 20న సుల్తాన్ పూర్ కోర్టులో రాహుల్ గాంధీ లొంగిపోయారు. కోర్టు రూ. 25వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాహుల్ వాంగ్మూలాన్నికోర్టు నమోదు చేయనుంది. కాగా ఈ వ్యాఖ్యలపై కలత చెందిన బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018లో రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. గత ఆరేళ్లుగా కేసు విచారణ కొనసాగుతోంది.