ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి కృషి
బీజేపీ జిల్లా ఇన్చార్జి జనార్ధన్
నా తెలంగాణ, నిర్మల్: అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్ట భద్రుల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన పట్ట భద్రులు ఓటరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బీజేపీ నిర్మల్ జిల్లా ఇన్చార్జి జనార్ధన్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం జరిగిన నిర్మల్ అసెంబ్లీ బీజేపీ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ శ్రేణులకు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా చేసుకుని ముందుకు పోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై పట్ట భద్రులను చైతన్య పరిచి, ఓటర్లను సంఘటితం చేయాలని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రాంరెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి, సత్య నారాయణ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.