వినాయక సెలవిక

Vinayaka Selavika

Sep 17, 2024 - 09:15
 0
వినాయక సెలవిక

నా తెలంగాణ, రామకృష్ణాపూర్: వినాయక ఇక సెలవు అంటూ భక్తులు గణనాథుని నిమజ్జనానికి తరలే సమయం ఆసన్నమైంది. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి సోమవారం సాయంత్రం వాహనాలను ముస్తాబు చేసి గణనాథులను నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగగా, రాజీవ్ చౌక్ లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్టేజి వేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణేష్‌ శోభాయాత్రకు పట్టణ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో భద్రత ఏర్పాట్లను చేశారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి పర్యవేక్షించారు. గణేష్‌ శోభాయాత్ర సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. మహిళలు కోలాటం వేయగా యువకులు డీజే పాటలకు నృత్యాలు చేస్తూ గణనాథునికి సెలవు పలికారు.