ఆదర్శ సమాజ నిర్మాణం ఉపాధ్యాయులకే సాధ్యం
తపస్ ఆధ్వర్యంలో 50మంది ఉపాధ్యాయులకు సన్మానం ఎంపీ గోడం నగేష్ ఉపాధ్యాయులను గౌరవించుకోవాలి: ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి
నా తెలంగాణ, ఆదిలాబాద్: ఆదర్శ సమాజాన్ని నిర్మించే శక్తి కేవలం ఉపాధ్యాయులకే ఉందని, ఉపాధ్యాయులు ఆదర్శవంతులని ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ అన్నారు. మంగళవారం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జడ్పీ సమావేశంలో గురువందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న 50 మంది ఉపాధ్యాయులకు శాలువా కప్పి, మెమెంటో, ప్రశంసా పత్రంతో సన్మానించారు.
ఈ సందర్భంగా గోడం నగేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పీఎం నేతృత్వంలో ‘బేటీ బచావో బేటీ పడావో, పడే భారత్ బడే భారత్’ లాంటి కార్యక్రమాలను తీసుకువచ్చిందన్నారు. ఎన్ ఎంఎంఎస్ స్కాలర్ షిప్, నూతన జాతీయ విద్యా విధానం 2020, అటల్ టింకరింగ్ ల్యాబ్ యోజన లాంటి పథకాలు అమలు చేస్తుందని నగేష్ తెలిపారు. దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉందన్నారు. జిల్లాలో విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని గోడం నగేష్ తెలిపారు.
కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఉత్తమ విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తపస్ ఆధ్వర్యంలో గురువందనం అభినందనీయమన్నారు. రాష్ర్ట ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆరోపించారు. విద్యా రంగానికి బడ్జెట్ లో తక్కువ కేటాయింపులు సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే డీఏలు, పీఆర్సీ ప్రకటన, 317 జీవో బాధితుందరికీ న్యాయం చేయాలని ఉపాధ్యాయుల తరఫున ఏవీఎన్ రెడ్డి డిమాండ్ చేశారు.
జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత మాట్లాడుతూ.. ఉపాధ్యాయులంతా కష్టపడి పనిచేసి విద్యాశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. తపస్ ఆధ్వర్యంలో గురువందనం వేడుకలు, సన్మానాలు అభినందనీయమన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్ కు సహకరిస్తానని ప్రణీత తెలిపారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దేశభక్తి జాతీయభావం పెంపొందించేందుకు కృషి చేయడం అభినందనీయమని తపస్ రాష్ర్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కానుగంటి హనుమంతరావు సురేష్ అన్నారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం విద్యకు నిధులు పెంచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు.
దేశ భవిష్యత్ కు పునాది తరగతి గదిలోనే పడుతుందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ ఎన్.వి. శివకుమార్ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించి మంచి భవిష్యత్తును అందించాలని సూచించారు. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయభావం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వేదాలు శాస్త్రాలు ప్రపంచానికి అందించింది భారతీయులేనని అన్నారు. ఆర్యభట్ట, వరాహ మీరుడు, చరుకుడు, శుశృతుడు, సీవీ. రామన్, సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి గొప్ప గురువులని ప్రపంచానికి అందించిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సునీల్ చౌహన్, వలభోజు గోపికృష్ణ
ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి టి ప్రణీత, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు నవత్ సురేష్, ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డీవీ రావ్, ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్, ట్రస్మా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్, జిల్లా నాయకులు బి. నారాయణ, మెస్రం రాజ్ కుమార్, మనోజ్ రెడ్డి, గోమంత్ రెడ్డి, బత్తుల గంగాధర్, యాదవ్ రావ్, జాదవ్ సురేష్, అంబాజీ, గోపాల కృష్ణ, వివిధ మండలాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.