గాంధారి జాతరకు పటిష్ఠ బందోబస్తు

Strong provision for Gandhari fair

Jul 27, 2024 - 21:32
 0
గాంధారి జాతరకు పటిష్ఠ బందోబస్తు

నా తెలంగాణ,రామకృష్ణాపూర్: బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి ఆదివారం జరుగనున్న గాంధారి మైసమ్మ జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ట్లు డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు. శనివారం ఆయన జాతర స్థలాన్ని పరిశీలించారు. జాతరకు కోల్ బెల్ట్ బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపూ ర్, మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ ఇతర జిల్లాల నుంచి మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. జాతర జాతీయ రహదారి పక్కన జరుగుతున్నందున పోలీసుల సూచనలను జాతరకు వచ్చే భక్తులు వాహనదారులు పాటించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారిపై బారీకేడ్ల ఏర్పాటు, రోడ్డు మార్గాల వద్ద పోలీస్ పెట్రోలింగ్, పెద్దఎతున్న బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గాంధారి మైసమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. భక్తులు అమ్మవారికి కోళ్లు, మేకలు బలి ఇచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. జంతుబలుల కోసం తాత్కాలిక షెడ్లు, దర్శనం కోసం క్యూ లైన్లు, వాహనాల పూజలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలాలను ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవి కుమార్, సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.