సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి
MLA Marri inspected CC road works
నా తెలంగాణ, అల్వాల్: అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం డివిజన్లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, బస్తీ వాసులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీవాసులు తాగునీరు త్రీఫేస్ కరెంటు సమస్యలు పరిష్కరించాలని, ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, అర్హులైన వారికి పెన్షన్, రేషన్ కార్డు, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక బస్తీవాసులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబితా కిషోర్ గౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటరావు, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మో, సురేష్, పోచయ్య, తాజుద్దీన్, ఫరీద్ బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.