బీర్ తాగుతూ ఆర్టీఓలో విధులు
Duties in RTO while drinking beer
నా తెలంగాణ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో మందుతాగుతూ పనులు చేయడం వివాదాస్పదమవుతుంది. ఈ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న సురేష్ మంగళవారం ఏం చక్కా జంకు బొంకూ లేకుండా బీర్ తాగుతూ విధులు నిర్వహిస్తున్నాడు. పైగా బీర్ ను టేబుల్ పైనే పెట్టుకొని మరీ ఎవడైతే నాకేంటీ అన్న విధంగా వ్యవహరించడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన ప్రజలు మీడియాకు సమాచారం అందించడంలో విషయం వెలుగులోకిచ్చింది. ఆపరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.