గుస్సాడి కనకరాజు మృతి తీరనిలోటు
కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి విచారం
నా తెలంగాణ, హైదరాబాద్: గిరిజన సాంప్రదాయ నృత్యమైన 'గుస్సాడి'కి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు మృతి తీరని లోటని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్ కుమురం భీం జిల్లా నుంచి వచ్చి.. గుస్సాడికి గుర్తింపు తీసుకురావడం కోసం కనకరాజు సర్వస్వాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ఆయన మృతి తెలంగాణకు మరీ ముఖ్యంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, గిరిజన సమాజానికి ప్రగాఢ సానుభూతిని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తెలియజేశారు.