శిఖం భూముల్లో నిర్మాణాల కూల్చివేత
ఆక్రమణ దారులకు హెచ్చరిక
నా తెలంగాణ, నిర్మల్: గత ప్రభుత్వ హయాంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో కొంత మంది ప్రజా ప్రతినిధులు చెరువులకు సంబంధించిన భూములు ఆక్రమణలపై కొరడా ఝళిపించారు. బస్ స్టాండ్ సమీపంలోని ధర్మసాగర్, ఎల్లపల్లి తదితర చెరువులను ఆక్రమించుకున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో మంగళవారం పర్యటించి చర్యలు చేపట్టారు. కొండాపూర్ చెరువులోని సర్వే నంబరు 321లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం అధికారులు ప్రోక్లెయిన్ తో కూల్చివేసి ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేశారు.