బీజేపీలో చేరిన లవ్లీ, మరో నలుగురు
వరుస షాక్ లతో కాంగ్రెస్ బేజారు
నా తెలంగాణ, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నేతలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వరుసగా పార్టీని వీడుతూ తలలు పట్టుకునేలా చేస్తున్నారు. శనివారం ఢిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ, రాజ్ కుమార్ చౌహాన్, నసీమ్ సింగ్, అమిత్ మాలిక్, నీరజ్ బసోయాలు బీజేపీలో చేరారు. ఆప్ తో పొత్తు నేపథ్యంలో తొలుత వారం క్రితం లవ్లీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీకి మాత్రం రాజీనామా సమర్పించలేదు. లవ్లీ రాజీనామాతో కాంగ్రెస్ లో ప్రకంపనలు రేగి వరుస రాజీనామాల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలో వారంతా బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ కేంద్ర నాయకులు సాదర స్వాగతం పలికారు. ఖండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అందరం కలిసి మెలిసి పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు.