దేశ భద్రత, సమగ్రత విషయంలో మోదీదీ ఉక్కు సంకల్పం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి దేశ భద్రత సమగ్రత విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన చొరవను యావత్ దేశం మరిచిపోలేనిదని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి జి కిషన్ రెడ్డి కొనియాడారు.

May 4, 2024 - 17:02
May 4, 2024 - 17:05
 0
దేశ భద్రత, సమగ్రత విషయంలో మోదీదీ ఉక్కు సంకల్పం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • కరోనా విపత్తును జయించిన ప్రధాని
  • వైద్యుల సేవలు మరువలేనివి
  • ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన భారత్
  • పోలింగ్ శాతం పెంచడంలో వైద్యులది కీలకపాత్ర
  • మౌలికరంగంలో విశేష పురోగతి
  • ఐఎంఏ ఆత్మీయ సమ్మేళనంలో టీ బీజేపీ చీఫ్

నా తెలంగాణ, హైదరాబాద్ :


ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి దేశ భద్రత సమగ్రత విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన చొరవను యావత్ దేశం మరిచిపోలేనిదని కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ లోక్ సభ అభ్యర్థి జి కిషన్ రెడ్డి కొనియాడారు. కరోనా విజృంభించిన వేళ అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించడానికి  ప్రధాని పడ్డ తపన గొప్పదన్నారు.

కరోనా విపత్కాలంలో వైద్యుల సేవలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా గుర్తించి వారిపై పూలవర్షం కురిపించారని కిషన్ రెడ్డి చెప్పారు. నారాయణగూడ తాజ్ మహల్ హోటల్ లో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  పాల్గొన్నారు. కరోనాలో డాక్టర్లు చూపించిన చొరవ అనిర్వచనీయమని, అందుకే మోది డాక్టర్ల సేవలను ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు.

విపత్కరమైన కరోనా నుంచి దేశాన్ని గట్టెక్కించడమే కాదు ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత మోది ప్రభుత్వానిదన్నారు. మౌలిక రంగాల అభివృద్ధిలో మోదీ హయాంలో రోడ్ల నుంచి విమానాశ్రయాల వరకు అద్భుత ప్రగతి సాధించామని చెప్పారు. ప్రపంచంలో దేశ ప్రతిష్ఠను, గౌరవాన్ని పెంచారని వివరించారు. మోదీ ఆధ్వర్యంలో దేశం ఏ స్థాయిలో ప్రగతి సాధించిందో మీకు తెలుసు..గత యూపీఏతో పోల్చుకుంటే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది..

రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నాం..రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ఇప్పటికే భారత ప్రభుత్వం వేగంగా పని చేస్తున్నదనికిషన్ రెడ్డి తెలిపారు. డాక్టర్లు సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందేవాళ్ళు, ఓటర్లే కాదు ఓటర్లను ప్రభావితం చేసే గొప్పశక్తి..ఒక్కసారి ఆలోచించండి.. మోదీని ఆశీర్వదించండి.. సికింద్రాబాద్ నుంచి నన్ను గెలిపించి వికసిత భారతాన్ని ఆవిష్కరించడంలో సహకరించాలని కోరారు. అందరినీ ఓటు వేసే దిశగా వైద్యులు చైతన్యపరచాలని విజ్ఞప్తి చేశారు. ఓల్డ్ సిటీలో 80 శాతం పోలింగ్ జరుగుతుందని, మిగతా ప్రాంతాల్లో 40 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు వైద్యబృందం కృషి చేయాలని కోరారు.