ఈడీపై దాడి కేసు.. సీబీఐ, ఈడీ అరెస్టు చేయొచ్చన్న కోర్టు

టీఎంసీ నేత షాజహాన్​ షేక్​ ను సీబీఐ, ఈడీ అరెస్టు చేయవచ్చని కోల్‌కతా హైకోర్టు పేర్కొంది.

Feb 28, 2024 - 16:30
 0
ఈడీపై దాడి కేసు.. సీబీఐ, ఈడీ అరెస్టు చేయొచ్చన్న కోర్టు

కోల్‌కతా: టీఎంసీ నేత షాజహాన్​ షేక్​ ను సీబీఐ, ఈడీ అరెస్టు చేయవచ్చని కోల్‌కతా హైకోర్టు పేర్కొంది. బుధవారం కేసును విచారించింది. సందేశ్​ ఖాలీలో హింసకు షాజహాన్​ ముఖ్య పాత్ర పోషించినట్లు పోలీసులు ఆరోపించారు.  సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా కేసులో షాజహాన్ షేక్ ప్రధాన నిందితుడు. ఈడీపై జరిగిన దాడి లో కూడా షాజహాన్​ హస్తం ఉన్నట్లు గుర్తించింది. అక్రమార్జన, అవినీతి ఆరోపణలపై ఈడీ బృందం షాజహాన్​ నివాస ప్రాంతాల్లో సోదాలు చేసేందుకు వెళ్లగా వందలాదిమందితో ఈడీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి షాజహాన్​ పరారీలో ఉన్నాడు. ఇటీవలే వారం క్రితం ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు. షేక్​ షాజహాన్​ తోబాటు అతనికి సహకరించిన ప్రజాప్రతినిధులందరినీ అరెస్టు చేయాలని మహిళలు, ప్రతిపక్ష పార్టీ బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే.