నిజ్జర్​ హత్య.. ముగ్గురు అరెస్ట్​

సాక్ష్యాధారాలు లభిస్తేనే సూత్రధారులెవరో చెప్పగలం అసిస్టెంట్​ కమిషనర్​ డేవిడ్​ టెబౌల్​

May 4, 2024 - 16:05
 0
నిజ్జర్​ హత్య.. ముగ్గురు అరెస్ట్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్​ హత్య కేసులో కెనడా పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని శనివారం మీడియాకు వివరించారు. కరణ్​ ప్రీత్​ సింగ్​, కమల్​ ప్రీత్​ సింగ్​, కరణ్​ బ్రార్​ లను అదుపులోకి తీసుకున్నారు. నిజ్జర్​ హత్య కేసులో వేగంగా దర్యాప్తు చేస్తున్నామని హత్య వెనుక ఎవరున్నారనేది త్వరలోనే తెలుస్తుందని అసిస్టెంట్​ కమిషనర్​ డేవిడ్​ టెబౌల్​ తెలిపారు.
భారత ప్రమేయం అని వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. సాక్ష్యాధారాలు పక్కా లభిస్తే గానీ ఏ విషయం చెప్పలేమన్నారు. అంతవరకు ఎవరిపై ఆరోపణలు చేయలేమని స్పష్టం చేశారు. తమ దర్యాప్తు క్రియాశీలకంగా కొనసాగిస్తున్నామని మాత్రమే తాను చెప్పదలచుకున్నానని డేవిడ్​ పేర్కొన్నారు. అన్ని కోణాల్లోనూ హత్యపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. 

అయితే నిజ్జర్​ హత్యపై ఆరోపణలు భారత్​ ఖండిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 

2023 జులై 18న కొలంబియాలోని సర్రేలో గురుద్వారా బయట హర్దీప్​ సింగ్​ నిజ్జర్​ హత్య జరిగిన విషయం తెలిసిందే. కాగా దీనిపై కెనడా ప్రధాని ట్రూడో నోరుపారేసుకొని హత్యలో భారత్​ ప్రమేయం ఉందని ఆరోపించారు. దీనిపై భారత్​ కూడా ధీటైన సమాధానాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా నిందలు వేయడం తగదని భారత్​ స్పష్టం చేసింది. మరోసారి ఇలాంటి ఆరోపణలు చేసేముందు రెండు దేశాల మధ్య ఉన్న సున్నితాంశాలను కూడా బేరీజు వేసుకుంటే బాగుంటుందని సుతిమెత్తని హెచ్చరికలు చేసింది.