ప్రజలకు లాలీపాప్ లు అవినీతిలో కాంగ్రెస్ వాటా!
బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రజలకు లాలీపాప్ లు అందించి కోట్ల అవినీతికి పాల్పడిన పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మండిపడ్డారు. శనివారం న్యూ ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అనుచిత ధోరణికి ఇది నిదర్శనమన్నారు. కర్ణాటకలో ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో కలిసి కాంగ్రెస్ అవినీతికి పాల్పడి భారీగా ఆస్తులు సంపాదించిందని ఆరోపించారు. కోర్టు నిందితుడిగా చేర్చినా విచారణకు జంకేందుకన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నంబర్ వన్ తో రాహుల్, సోనియాగాంధీలు నిలబడాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మల్లిఖార్జున ఖర్గే కూడా కర్ణాటక నుంచి వచ్చారు. కర్ణాటకలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతి తారాస్థాయికి చేరిందో చెప్పాలన్నారు. ఇందులో కాంగ్రెస్ అవినీతి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. హరియాణా అభ్యర్థి ఏది చెబితే అదే కర్ణాటక సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారున్నారని విమర్శించారు. బెంగాల్ లో నేరస్థుల నైతికత ఎలా పెరిగిందో చూడాలన్నారు. ప్రభుత్వాలు కూడా వారి ముందు బందీలుగా మారాయన్నారు. ఐఏఎస్ అధికారి భార్యతో అనుచితంగా ప్రవర్తించిన కేసులో కూడా ఆ రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. పశ్చిమ బెంగాల్ మహిళలు, విద్యార్థినులకు ప్రమాదకరంగా మార్చడంలో ఎవరి పాత్ర ఉందని ప్రశ్నించారు. సోరెన్, రాహుల్, సిద్ధరామయ్య, మమతా బెనర్జీలది ఒప్పుకోలు పాలన అని సుధాన్షు త్రివేది విమర్శించారు.