24/7 దేశ సేవకే అంకితం

24/7 dedication to national service

Jun 7, 2024 - 14:17
 0
24/7 దేశ సేవకే అంకితం

నా తెలంగాణ, ఢిల్లీ: 24/7 తాను దేశ సేవకు, ప్రజాసేవకు కట్టుబడి ఉన్నానని నరేంద్ర మోదీ అన్నారు. తన కోసం వన్​ లైఫ్​ వన్​ మిషన్​ (ఒకే జీవితం, ఒకే ఆశయం) అన్నారు. 140 కోట్ల ప్రజల కలలను నిజం చేయడమే తన ఆశయమన్నారు. వారిని అభివృద్ధిని చేసి వారు గౌరవంగా తల ఎత్తుకునేలా జీవింప చేయడమే తన లక్ష్యమన్నారు. భారతీయుల ముందు ప్రపంచదేశాలు తలదించుకునేలా రూపొందించాలనేది తన లక్ష్యమన్నారు. ఆ దిశలోనే తన పాలన ఉండబోతుందని స్పష్టం చేశారు. మరోమారు తనను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నందుకు ఎన్డీయే పక్షాలకు, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.