నక్సలైట్లు ఏ భాషలో వింటే అదే భాషలో చెబుతాం
హింసామార్గాన్ని విడనాడీ చర్చలకు వస్తే స్వాగతిస్తాం చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్
రాయ్ పూర్: నక్సలైట్లు బుల్లెట్లు, ఆయుధాలతోనే వింటారంటే ప్రభుత్వం కూడా వారి భాషలోనే చెబుతుందని చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ అన్నారు. ఒకవేళ హింసామార్గాన్ని విడనాడీ మాటలతో మంచి మార్గంలో నడవాలని తలస్తే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని సీఎం అన్నారు. మంగళవారం ఎన్ కౌంటర్ కు ముందు సీఎం విష్ణుదేవ్ సాయ్ మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నక్సలిజంపై పోరు తీవ్రతరం చేశామని తెలిపారు. చత్తీస్ గఢ్ లో నక్సల్స్ సమస్య పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో బీజేపీ ఉందని తెలిపారు. హోంమంత్రి కూడా ఇదే విషయాన్ని పలు వేదికల ద్వారా స్పష్టం చేశారని తెలిపారు. అభివృద్ధి జన జీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి స్వాగతం పలుకుతామని సీఎం సాయ్ తెలిపారు. తాము నక్సలైట్లను జన జీవన స్రవంతిలో కలవాలని తానే కాదు చాలాసార్లు హోంమంత్రి విజయ్ శర్మ కూడా విజ్ఞప్తి చేశారనే విషయాన్ని గుర్తు చేశారు.