2030నాటికి 50శాతం దాటనున్న క్లీన్ ఎనర్జీ
ఆర్బీఐ నివేదికలో వెల్లడి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్ లో విద్యుత్ ఉత్పత్తిలో శిలా ఇంధనం ఆధిపత్యం ముగిసి 2030 నాటికి క్లీన్ ఎనర్జీ 50 శాతం దాటుతుందని ఆర్బీఐ శనివారం నివేదికలో వెల్లడించింది. శక్తిపరివర్తనలో భాగంగా పునరుత్పాదక ఉత్పత్తిలో వృద్ధి నమోదవుతుందని వెల్లడించింది. క్లీన్ ఎనర్జీలో భాగంగా పెట్టుబడులు కూడా పెరగనున్నాయని పేర్కొంది. ఈ ప్రయత్నంలో పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపింది. అన్ని పరిశ్రమ వర్గాలకు క్లీనర్ పవర్ జనరేషన్ వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. దీంతోపాటు కార్బన్ ఉద్ఘారాలను కూడా గణనీయంగా తగ్గించగలుగుతామన్నారు. ఈ రంగంలో డాలర్ పెట్టుబడులు పెరగనున్నాయని ఆర్బీఐ తెలిపింది. 2050 నాటికి డీకార్బనైజ్ గ్లోబల్ ఎనర్జీ సిస్టమ్ స్థాపించేందుకు 215 యూఎస్ డీ ట్రిలియన్ల డాలర్లు చేరుకుంటుందని తెలిపింది. దీంతో ఆర్థిక రంగం మరింత బలోపేతం అవుతుందని తెలిపింది. శక్తి పరివర్తనలో సంపూర్ణత సాధించేందుకు పబ్లిక్ పాలసీ జోక్యాలు, మార్కెట్ ఆధారిత పోటీ మధ్య సరైన సమతుల్యత సాధించడం అవసరమని ఆర్బీఐ స్పష్టం చేసింది.