ఉన్నత విద్య బడ్జెట్​ కు లోక్​ సభ ఆమోదం

Lok Sabha approves higher education budget

Aug 1, 2024 - 22:05
 0
ఉన్నత విద్య బడ్జెట్​ కు లోక్​ సభ ఆమోదం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉన్నత విద్య బడ్జెట్​ పెంపుదలకు లోక్​ సభ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ గురువారం లోక్​ సభలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. 2047 వరకు 30 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. 

2013-14లో విద్యారంగానికి 4 లక్షల 30 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయగా, ప్రస్తుతం విద్యారంగంపై రూ. 9 లక్షల 19 వేల కోట్లకు పెరిగిందని, ఇది గతంలో కంటే 78 శాతం ఎక్కువన్నారు. 

దేశంలో ప్రతీ ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనేదే లక్ష్యమన్నారు. సరసమైన, సమానమైన విద్య అందరికీ అందాలన్నదే తమ ప్రభుత్వ, ప్రధాని మోదీ ఉద్దేశ్యమని మంత్రి పేర్కొన్నారు.