మమతపై నమ్మకం లేదు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎప్పుడైనా ఎటువైపైనా మొగ్గు చూపవచ్చని, ఆమెపై తనకు ఏ మాత్రం నమ్మకం లేదని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అన్నారు.
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఎప్పుడైనా ఎటువైపైనా మొగ్గు చూపవచ్చని, ఆమెపై తనకు ఏ మాత్రం నమ్మకం లేదని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిస్తామని ఆమె చేసిన ప్రకటనపై అధీర్ రంజన్ మండిపడ్డారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆమె అటువైపే వెళుతుందన్నారు. మమత గతంలో కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించేవారన్నారు. 40 సీట్లు కూడా తమ పార్టీకి రావని చెప్పేవారని పేర్కొన్నారు. ఇప్పుడు కూటమికి మద్దతిస్తానని ఓసారి కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికే తన మద్దతు అని ఇంకోసారి ప్రకటించడాన్ని చూస్తే ఆమె ఏ విధంగా ప్లేటు ఫిరాయిస్తుందో ఎవ్వరికి తెలియదని అధీర్ రంజన్ చెప్పారు.