భారత్​–వియత్నాం 9 ఒప్పందాలపై సంతకాలు

మోదీ నేతృత్వంలో మంత్రి వర్గ బృందంతో భేటీ ద్వైపాక్షిక బంధాల బలోపేతమే లక్ష్యం వివరాలు వెల్లడించిన విదేశాంగ కార్యదర్శి జై దీప్​

Aug 1, 2024 - 21:57
 0
భారత్​–వియత్నాం 9 ఒప్పందాలపై సంతకాలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–వియత్నాం ద్వైపాక్షిక బంధాలను మెరుగుపరిచేందుకు తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇరుదేశాల ఒప్పంద వివరాలను విదేశాంగ మంత్రిత్వ కార్యదర్శి జై దీప్​ వెల్లడించారు. 
 ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు, వియత్నాం ప్రధాని ఫామ్​మిన్​ చిన్హ్, మంత్రివర్గ బృందాలు గురువారం బంధాల బలోపేతంపై సమావేశమయ్యాయి. 
 
కస్టమ్స్, వ్యవసాయం, చట్టంపరమైన, రేడియో, టెలివిజన్ ప్రసారం, సంస్కృతి, పర్యాటక రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. భారత్​ – వియత్నాం మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన అమెరికన్​ డాలర్లకు చేరుకుందన్నారు. వియత్నాం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు కీలకమైని జై దీప్​ తెలిపారు.
 
2024-2028 మధ్యకాలంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమలు చేసేందుకు రెండు దేశాలు కార్యాచరణ ప్రణాళికపై అంగీకరించాయన్నారు. రెండు దేశాల మధ్య 300 మిలియన్ యుఎస్ డాలర్ల రెండు డాలర్ల క్రెడిట్ లైన్ ఒప్పందాలు కూడా ఖరారైనట్లు ఆయన తెలిపారు. విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం వియత్నాం కూటమిలో చేరుతుందని జై దీప్​ స్పష్టం చేశారు.