నీట్​ కౌన్సెలింగ్​ నిలుపుదలకు సుప్రీం నో

ఎన్టీయే సమాధానం ఇవ్వాలని మరోమారు నోటీసు

Jun 21, 2024 - 16:15
 0
నీట్​ కౌన్సెలింగ్​ నిలుపుదలకు సుప్రీం నో

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నీట్​ కౌన్సెలింగ్​ ప్రక్రియను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు మరోమారు నిరాకరించింది. శుక్రవారం కౌన్సెలింగ్​ నిలుపుదల పిటిషన్​ ను విచారించింది. ఇదే సమయంలో ఎన్టీఏకు రెండోమారు నోటీసులు కూడా జారీ చేసి సమాధానాలు కోరింది. అన్నిపిటిషన్​ లతో కలిపి ఈ పిటిషన్​ ను కూడా జూలై 8న విచారిస్తామని సుప్రీం స్పష్టం చేసింది. నీట్​ పరీక్ష రద్దు, కౌన్సెలింగ్​ నిలిపివేయాలని పలు పిటిషన్​ లు దాఖలయ్యాయి. పరీక్ష రద్దుకు సుప్రీం ససేమిరా చెప్పింది. అక్రమాలకు తావిచ్చిన ఆరోపణలున్న సెంటర్లకు చెందిన విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించాలని సుప్రీం స్పష్టం చేసింది. అదే సమయంలో కౌన్సెలింగ్​ నిలుపుదలకు కూడా నో చెప్పిన విషయం తెలిసిందే.