మహానీయులను స్మరించుకుందాం

Let's remember the greats

Aug 14, 2024 - 12:37
 0
మహానీయులను స్మరించుకుందాం
  • హర్​ ఘర్​ తిరంగాలో ప్రతీఒక్కరూ పాల్గొనాలి
  • జాతీయ పతాకావిష్కరణలో భారత్​ రికార్డు
  • ప్రధాని మోదీ, జేపీ నడ్డా పిలుపునకు విశేష స్పందన
  • పబ్లిక్​ గార్డెన్​ లో వల్లభాయ్​ పటేల్​ విగ్రహానికి నివాళులు
  • జాతీయ పతాకావిష్కరణ
  • కేంద్రమంత్రి జి.కిషన్​ రెడ్డి

నా తెలంగాణ, హైదరాబాద్​: స్వాతంత్ర్యం సిద్ధించి 75యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాత్మాగాంధీ, అల్లూరి, సుభాష్​ చంద్రబోస్​, డాక్టర్​ బి.ఆర్​ అంబేద్కర్​, భగత్​ సింగ్​ లాంటి మహానీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు. 

బుధవారం బీజేపీ పార్టీ నేతృత్వంలో నాంపల్లి పబ్లిక్​ గార్డెన్​ లోని వల్లభాయ్ పటేల్​ విగ్రహానికి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన పిలుపులో భాగంగా ‘హర్​ ఘర్​ తిరంగా’ కార్యక్రమంలో 25 కోట్ల మంది భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. ఈ రోజు సాయంత్రం వరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై తమ తమ ఇళ్లపై జాతీయ జెండాలను కుటుంబ సభ్యులతో కలిసి ఎగురవేసి సెల్ఫీలు తీసుకొని అప్ లోడ్​ చేయాలని, సామాజిక మాధ్యమాల్లో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే ఇంతపెద్ద యెత్తున జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం ఏ దేశంలో జరగలేదన్నారు. భారత్​ ఈ పతాకావిష్కరణలో రికార్డులు నెలకొల్పిందన్నారు. 

ఆగస్ట్​ 15 జాతీయ సందర్భంగా ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభిస్తుందని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. గ్రామ గ్రామాన, పట్టణాలు, బస్తీలు ఇలా అన్ని చోట్ల ఈ కార్యక్రమాంలో భాగస్వాములై విజయవంతం చేయాలన్నారు. అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ వారి విగ్రహాలను శుభ్రం చేసి నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 

బీజేపీకి సంబంధించినంత వరకు జాతీయ పతాకం కంటే విలువైనది ఏదీ లేదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సైతం సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.