లాలాషా బస్తి సమస్యలు పరిష్కరించాలి

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసిన కాలనీవాసులు

May 26, 2024 - 23:01
May 26, 2024 - 23:03
 0
లాలాషా బస్తి సమస్యలు పరిష్కరించాలి

అల్వాల్ సర్కిల్ లోని మచ్చ బొల్లారం డివిజన్ లోని లాలాషా బస్తి లో భూగర్భ డ్రైనేజీ పనులను చేపట్టాలని, వీధిలైట్లు వేయించాలని, ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంటు స్తంభాల ఏర్పాటు , బోర్వెల్  మరమ్మతులు చేయించాలని, సమస్యలు పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు కాలనీవాసులు.  సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులను లలాషా బస్తి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ఆతిక్ పాషా, జావేద్, అఫ్జల్, లాలాషా బస్తి వాసులు  సికిందర్ గౌసుద్దీన్ రషీద్, యాస్మిన్, ఇమ్రాన్, సాదిక్, , ఆజాం, కాజా పాషా,  తదితరులు పాల్గొన్నారు