దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర
తిరంగ యాత్రలో కేంద్ర మంత్రి అమిత్ షా
అహ్మాదాబాద్: దేశాభివృద్ధి కలల సాకారానికి యువత ప్రముఖ పాత్ర పోషిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అహ్మాదాబాద్ విరాట్ నగర్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన తిరంగా యాత్రను జెండా ఊపీ ప్రారంభించారు. అనంతరం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తిరంగ యాత్ర దేశ భక్తికి నిదర్శనమన్నారు. 2047 నాటికి అభివృద్ధి దిశగా పయనింప చేసేందుకు నిబద్ధతో పనిచేస్తున్నామని తెలిపారు. తిరంగ యాత్ర ద్వారా దేశాన్ని ఏకం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశ్యమన్నారు. ఈ యాత్రలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని, హర్ ఘర్ తిరంగలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని అమిత్ షా కోరారు. కార్యాలయాలు, ఇళ్లు ప్రతీ చోట దేశ మువ్వన్నెలను రెపరెపలాడించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రితోపాటు సీఎం భూపేంద్ర పటేల్, ఆరోగ్య శాఖ మంత్రి రిషికేష్ పటేల్, పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.