ప్రయత్నాలను ఆపబోం

ప్రజాశీర్వాదంతోనే అభివృద్ధి పథంలోకి ప్రపంచదేశాల్లో మార్మోగుతున్న భారత కీర్తి ప్రతిష్ఠలు ఓటు శక్తి వల్లే మార్పు సాధ్యమైందన్న ప్రధాని కాంగ్రెస్ ది ముస్లింలీగ్​మేనిఫెస్టో ఫ్లాప్​  దేశానికి ఉపయోగం ఏమీ లేదు ఆధ్యాత్మిక, భక్తిభావాన్నే తిరస్కరిస్తారా? రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారా? యూపీ సహారన్​పూర్​ ఎన్నికల సభలో ప్రధాని మోదీ

Apr 6, 2024 - 15:38
 0
ప్రయత్నాలను ఆపబోం

సహారన్​పూర్: ప్రజాశ్వీరాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళతామని, ఈ ప్రయత్నాలను ఎన్నటికీ ఆపబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ కేవలం పదేళ్లలో భారత్​ను 11వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించామన్నారు. ఇదంతా ప్రజాశీర్వాదం వల్లే జరిగిందన్నారు. కాంగ్రెస్​ హయాంలో అవినీతి, సమస్యలు తాండవించేవన్నారు. యూపీ ఎన్నికల సభలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. 

యూరప్, అమెరికా, ఆఫ్రికా ప్రపంచంలో అంతా భారత కీర్తి మార్మోగిపోతోందన్నారు. ఇదంతా ఎలా జరిగిందని ప్రశ్నించారు. 140 కోట్ల మంది సరైన వ్యక్తిని, నీతి నిజాయితీ వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేయడం వల్లే భారత కీర్తి ఫరిడవిల్లుతోందన్నారు. ఇదంతా మీ ఓటు శక్తి అని గుర్తుంచుకోవాలన్నారు. 
బీజేపీ స్థాపించిన రోజని అన్నారు. చాలా తక్కువ యేళ్లలో రికార్డు సంఖ్యలో ప్రజలు పార్టీ వెంట నడిచారన్నారు. బీజేపీ ప్రజల మనసు గెలిచిందని, విశ్వాసాన్ని సాధించిందని అన్నారు. దీనికి కారణం బీజేపీ రాజకీయం చేయదని దేశక్షేమం ముఖ్యమని అన్నారు. ఇదే తమ కల, సంకల్పం అని అన్నారు. దేశ కీర్తి ప్రతిష్ఠల కన్నా ప్రాముఖ్యత తమకు ఏదీ లేదన్నారు. అందుకే బీజేపీ తమ సిద్ధాంతాలు, సంకల్పాలు ఎన్నటికీ పై స్థాయిలోనే ఉంటాయన్నారు. నిరుపేదల అభివృద్ధి తమ రాజకీయ ప్రకటన కాదన్నారు. తమ లక్ష్యమన్నారు. అందుకే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని మోదీ తెలిపారు. 

కాంగ్రెస్​ మేనిఫెస్టోను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి సినిమా ఫ్లాప్​ కానుందన్నారు. అందుకే మరోమారు దేశ ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి తమవైపు తిప్పుకోవాలని భావిస్తోందన్నారు. కానీ దేశ ప్రజలు ఈ విషయాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నారని తగిన సమయంలో కాంగ్రెస్​కు మరోమారు బుద్ధి చెప్పడం ఖాయమని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇండికూటమి అంతా అవినీతి, అక్రమాలు, కుటుంబతత్వ కూటమి అని మోదీ పునరుద్ఘాటించారు. మేనిఫెస్టోలో ముస్లింలీగ్​ ఆలోచనలే ప్రతిబింబింప చేసిందన్నారు. దీని ద్వారా కాంగ్రెస్, ఇండి కూటమి, వామపక్ష నాయకులకు తప్ప దేశ ప్రజలకు, సంక్షేమానికి ఎలాంటి ఉపయోగం లేదని మోదీ అన్నారు. 

ఆధ్యాత్మికత, భక్తిభావాన్ని తిరస్కరించని దేశం భారత్​అన్నారు. అలాంటి దేశంలో సాక్షాత్తూ రామాలయ నిర్మాణాన్నే వ్యతిరేకించిన కాంగ్రెస్​పార్టీ మనుగడ ఇక కష్టమేనని మోదీ పేర్కొన్నారు. ఒక్క సహారన్​పూర్​ రైతుల కోసం పీఎం కిసాన్​ నిధి ద్వారా మూడు లక్షల మందికి రూ. 860 కోట్లు లబ్ధి చేకూర్చామన్నారు. ప్రపంచ మార్కెట్​లో యూరియా బస్తా రూ. 3వేలకు లభిస్తుంటే భారత మార్కెట్​లలో రూ. 300లకే అందజేయగలుగుతున్నామని తెలిపారు. 

సహరాన్‌పూర్‌లో బీజేపీ మాజీ ఎంపీ రాఘవ్ లఖన్‌పాల్‌ను బరిలోకి దించగా, బీఎస్పీ అభ్యర్థిగా మాజిద్ అలీ బరిలో ఉన్నారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఇమ్రాన్ మసూద్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి లఖన్​పాల్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.