ఇజ్రాయెల్ పై హిజ్బొల్లా భారీ దాడులు
Hezbollah's heavy attacks on Israel
బీరూట్: ఇజ్రాయెల్– హిజ్బొల్లాల మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా శుక్రవారం హిజ్బొల్లా భారీ దాడులో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. ఒకేసారి 140 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ కు ఏ మేరకు నష్టం వాటిల్లిందనే వివరాలు వెల్లడికాలేదు. హిజ్బొల్లా దాడులతో అప్రమత్తమైన ఐడీఎఫ్ ప్రతిదాడులకు దిగింది. ఇరువురి మధ్య ఉద్రిక్తతలు, బాంబుదాడుల వల్ల సామాన్య ప్రజానీకానికి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తుండడం పట్ల ప్రపంచదేశాల్లో ఆందోళన నెలకొంది.