ఘనంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమంగా శనివారం శుభాకాంక్షలు తెలిపారు. దేశ క్షేమం కోసం ఉద్భవించిన పార్టీ బీజేపీ అన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ ప్రగతికి అనుక్షణం కష్టపడి పనిచేసి పార్టీని ఈ స్థాయికి తీసుకువచ్చారని కొనియాడారు. 2024 ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తల కృషి వల్లే మరోసారి బీజేపీ పార్టీ అధికారం సాధించబోతోందని భవిష్యత్ తరాలకు సురక్షిత భారత్‌ను నిర్మించుకుందామని, ఇందుకు అందరి సహాయ సహకారాలు అవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
కార్యాలయంలో జే.పి.నడ్డా..
బీజేపీ స్థాపన దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జాతీయాధ్యక్షుడు జేపి.నడ్డా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వందేమాతరం గీతాన్ని ఆలపించారు. పార్టీ పటిష్ఠతకు పనిచేసిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేయస్సుకు, అభివృద్ధి కోసం కార్యకర్తలు అహార్నిశలు కృషి చేయడం అభినందనీయమన్నారు.
అమిత్ షా..
కార్యకర్తల త్యాగం, అంకితభావం, కృషితో దేశవ్యాప్త పార్టీ విస్తరణను అందించిన సీనియర్ నాయకులకు, కార్యకర్తలు, కార్మిక, కర్షకులకు కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.