మరో పదేళ్లు నిర్విఘ్నంగా పాలన

ఎన్డీయే పునాది ఆషామాషీది కాదు: మోదీ

Jun 7, 2024 - 14:38
 0
మరో పదేళ్లు నిర్విఘ్నంగా పాలన

నా తెలంగాణ, ఢిల్లీ: ఎన్​ డీఏ పక్షాల సహకారంతో రాబోయే పదేళ్లు కూడా నిర్విఘ్నంగా బీజేపీ పాలన కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన అనంతరం మాట్లాడారు. ఎన్డీయే పార్టీలది ఆషామాషీ పునాది కాదన్నారు. ప్రజలు నేడు ఈ పునాదికి మరింత బలాన్ని చేకూర్చారని మోదీ తెలిపారు. ఈ పునాది దక్షిణ భారతదేశంలో కూడా బలపడడం సంతోషదాయకమన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో రానున్న 10 ఏళ్లలో సుపరిపాలన అందిస్తామన్నారు. అభివృద్ధి, నిరుపేదలకు నాణ్​యమైన జీవితాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు. సాంకేతిక యుగంలో నిరుపేదలు, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి అందరం కలిసి కృషి చేయాలన్నారు. ప్రపంచదేశాల్లో భారత్​ ను అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందించేందుకు అందరి సహాయ సహకారాలు అవసరమని మోదీ పేర్కొన్నారు. దేవదేవుడు జగన్నాథుడి దయాతో రాబోయే 25యేళ్లలో భారతదేశ పటంలో ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్​ర్టంగా తీర్చిదిద్దుతామన్నారు. పూర్తి ఆధునికతను సంతరించుకునేలా రూపొందిస్తామని మోదీ అన్నారు.

ఎన్డీయే విజయానికి మహిళా శక్తి కీలక భాగస్వామ్యం పోషించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలోనే దేశంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు అత్యధిక స్థానాలను కేటాయించిన పార్టీ బీజేపీ, ఎన్డీయే భాగస్వామ్య పార్టీలదే అన్నారు.