దంతెవాడలో ఎన్​ కౌంటర్​ ఏడుగులు మావోలు మృతి

ముగ్గురు భద్రతా సిబ్బంది గాయాలు

Jun 8, 2024 - 15:53
 0
దంతెవాడలో ఎన్​ కౌంటర్​ ఏడుగులు మావోలు మృతి

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ లో నక్సల్స్​ కు మరో భారీ దెబ్బ తగిలింది. శుక్రవారం రాత్రి నుంచి భద్రతా బలగాలు–నక్సల్స్​ కు మధ్య కొనసాగుతున్న కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు మృతిచెందినట్లుగా డిఐజీ రిజర్వ్​ దళానికి చెందిన ఉన్నతాధికారి శనివారం మీడియాకు వివరాలందించారు. నారాయణ్​ పూర్​ –  దంతెవాడ జిల్లాల సరిహద్దులోని గోబెల్​ అటవీ ప్రాంతంలో శుక్రవారం కూంబింగ్​ నిర్వహిస్తుండగా నక్సల్స్​ కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. రాత్రంతా కాల్పులు కొనసాగాయన్నారు. 
శనివారం ఉదయం కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి పలువురు నక్సల్స్​ తప్పించుకున్నారని పేర్కొన్నారు. ఆప్రాంతంలో ఏడుగురు నక్సల్స్​ మృతి చెందారని తెలిపారు. 

మావోయిస్టుల కదలికలను నిర్మూలించేందుకు ఐటీబీపీతో కలిసి డిఐజీ రిజర్వ్​ దళం సంయుక్తంగా ఆపరేషన్​ చేపట్టిందని తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సనందింప చేస్తున్నామని తెలిపారు.