బీజేపీని ఓడించడానికి ఎంఐఎం, కాంగ్రెస్ కుట్రలు

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయొద్దని ఫత్వా జారీ చేయించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Feb 16, 2024 - 13:44
 0
బీజేపీని ఓడించడానికి ఎంఐఎం, కాంగ్రెస్ కుట్రలు

నా తెలంగాణ, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బీజేపీని ఓడించడానికి ఫత్వా జారీ చేయించిందని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ సారి వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ బూత్ అధ్యక్షులు, అ పై స్థాయి నాయకుల సమావేశంలో  గురువారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ఓట్లు ఎంఐఎంకు గానీ కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి తప్ప బీజేపీ వేయొద్దని ఫత్వా జారీ చేయించారన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం ను ఓడించి బీజేపీ జెండా ఎగురవేయడానికి అక్కడి ప్రజలే సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంటు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని, ఫ్రిబ్రవరి చివరి వారంలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే ఎన్నికలు దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపచేయడం కోసం జరిగే ఎన్నికలని చెప్పారు.
యూపీఏ హయాంలో దేశం అవినీతి కుంభకోణాలతో కొట్టిమిట్టాడిందన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ నీతివంతమైన పాలనతో దేశాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారని వివరించారు. బాంబు పేలుళ్లు, ఐఎస్ఐ కార్యక్రమాలు, మతకల్లోహాలు, కర్ఫ్యూల బారినుంచి దేశాన్ని కాపాడింది నరేంద్ర మోదీ ప్రభుత్వమన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.
హైదరాబాద్ చుట్టు ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్ నిర్మాణం, రూ. 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ ఆధునీకరణ, రూ. 450 కోట్లతో కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.  నెలరోజుల పాటు పార్టీ శ్రేణులు సమన్వయంతో కలిసిమెలిసి పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ సీనియర నాయకుడు మురళీధర్ రావు పాల్గొన్నారు.