జీతాలు ఎప్పుడిస్తరు సారూ?

తెలంగాణ వైద్య విధానపరిషత్తు ఉద్యోగుల ఆందోళన ఏప్రిల్ రెండో వారం దాటుతున్నా పట్టించుకోని ప్రభుత్వం  12,000 మందికి అందని వేతనాలు ఉగాది పండుగ నాడు పస్తులున్నమని ఉద్యోగుల అవేదన

Apr 13, 2024 - 21:30
 0
జీతాలు ఎప్పుడిస్తరు సారూ?

నా తెలంగాణ,హైదరాబాద్‌: ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలిచ్చాం.. సీఎం రేవంత్‌రెడ్డి మొదలు ప్రభుత్వ పెద్దలంతా చేసుకుంటున్న ప్రచారం ఇది. కానీ, ఇప్పటివరకు తమకు వేతనాలు అందలేదని తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీవీపీ పరిధిలో శాశ్వత, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కలిపి సుమారు 12 వేల మంది పనిచేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ పరిధిలోని డీపీహెచ్‌, డీఎంఈ విభాగాల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు నెల ప్రారంభంలోనే వేతనాలు వేశారు. టీవీవీపీ పరిధిలోని ఉద్యోగులకు మాత్రం ఇప్పటివరకు అందలేదు. ఏప్రిల్ వచ్చి రెండు వారాలు అవుతోంది.. దీంతో ఉగాది పండుగనాడు కూడా పస్తులే ఉన్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.