వాలెంటైన్స్ డేను అడ్డుకుంటం
స్వదేశీ విలువలను కాపాడుకునేందుకు విదేశీ సంస్కృతిని బహిష్కరించాలని, ఫిబ్రవరి14న నిర్వహించే వాలైంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.
నా తెలంగాణ, హైదరాబాద్: స్వదేశీ విలువలను కాపాడుకునేందుకు విదేశీ సంస్కృతిని బహిష్కరించాలని, ఫిబ్రవరి14న నిర్వహించే వాలైంటైన్స్ డేను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మంగళవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.14న పుల్వామాలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తామని, అమరజవాన్ల దినోత్సవమని పేర్కొన్నారు. దేశ యువత విదేశీ సంస్కృతి, మత్తు నుంచి బలికావద్దని, కార్పొరేట్ శక్తుల కుట్రలలో ఇరుక్కోవద్దని సూచించారు. దేశం కోసం, ధర్మం కోసం పరితపించేలా ప్రతీ ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలని, శ్రీ సీతారాముల జీవితాలను ఆదర్శంగా తీసుకొని దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం మనవంతు బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.