అరుణాచల్ సీఎంగా పెమా ప్రమాణ స్వీకారం
Arunachal takes oath as CM
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా చౌనా మెయిన్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలతోపాటు మంత్రులుగా బియురామ్ వాఘా, న్యాటో దుకామ్, గన్రిల్ డెన్వాంగ్ వాంగ్సు, వాంకీ లోవాంగ్, పసాంగ్ దోర్జీ సోనా, మామా న్టుంగ్, దాసంగ్లు పుల్, బలో రాజా, కెంటో జిని మరియు ఓజింగ్ తాసింగ్ లు ప్రమాణం చేశారు.
ఇటానగర్‌లోని దోర్జీ ఖండూ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్లుమ పాల్గొన్నారు. జూన్ 12న బీజేపీ నాయకులు రవిశంకర్ ప్రసాద్, తరుణ్ చుగ్ లు ఖండూతో కలిసి గవర్నర్ కెటి పరానాయక్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను సమర్పించారు.