నా తెలంగాణ, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కు గురైంది. శుక్రవారం ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు కోర్టు గుర్తించి విచారణ చేపట్టింది. సుప్రీం యూ ట్యూబ్ చానెల్ ను వీక్షించేందుకు చూడగా దీని స్థానంలో రిపుల్ అనే ఛానెల్ కనిపిస్తుంది. ఈ ఛానెల్ లో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియోలు దర్శనమిస్తున్నాయి.
సుప్రీం ఏర్పాటు చేసిన ఈ యూట్యూబ్ చానెల్ లో రాజ్యాంగ బెంచ్ లకు సంబంధించిన కేసులు, విచారణ, ప్రజా ప్రయోజన విషయాలు ప్రసారితం అవుతాయి.
ఆర్టికల్ 21 ప్రకారం న్యాయాన్ని పొందే హక్కులో లైవ్ స్ట్రీమింగ్ ప్రొసీడింగ్స్ భాగం. విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కోర్టు యూట్యూబ్‌ని ఉపయోగిస్తోంది.
అయితే ఈ హ్యాకింగ్ పై రిప్పిల్ సంస్థ సీఈవో బ్రాడ్ గార్లింగ్ హౌస్ కూడా తీవ్ర ఆవేదన, ఆందోళనలు వ్యక్తం చేస్తూ యూట్యూబ్ పై ఫిర్యాదు చేశారు.