రాహుల్​ గాంధీ ఉగ్రవాదే!

కేంద్రమంత్రి రవ్​ నీత్​ బిట్టు

Sep 15, 2024 - 19:06
 0
రాహుల్​ గాంధీ ఉగ్రవాదే!

పట్నా: రాహుల్​ గాంధీ సిక్కుల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన నంబర్​ 1 ఉగ్రవాది అని కేంద్రమంత్రి రవ్ నీత్​ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బిహార్​ లోని భాగల్​ పూర్​ లో ఓ కార్యక్రమం సందర్భంగా బిట్టు ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్​ విదేశాల్లో వ్యాఖ్యలు వేర్పాటువాదిలా ఉన్నాయని మండిపడ్డారు. సిక్కులకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని అన్నారు.  ముస్లింలను మచ్ఛిక చేసుకోవాలని చూశారని, అది కుదరకపోతే ఇప్పుడు సిక్కులపై విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లిన వ్యక్తి కేవలం మోదీయే అన్నారు. ఏ ఒక్కరూ వెళ్లలేదన్నారు. రాహుల్​ విదేశాల్లోని వ్యాఖ్యలను వేర్పాటు వాదులు మెచ్చుకోవడం వారి దేశవ్యతిరేకతకు నిదర్శనమన్నారు. రాహుల్​ గాంధీ భారతీయుడే కాదన్నారు. అందుకే ఈ దేశాన్ని ప్రేమించడం లేదన్నారు. ప్రతీదీ దేశ వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. అందుకే రాహుల్​ గాంధీ ప్రతిపక్షంలో కూర్చొన్నారని విమర్శించారు.