కాంగ్రెస్​ లో దేశభక్తేది?

గణపతి పూజపై విమర్శలా

Sep 20, 2024 - 14:38
 0
కాంగ్రెస్​ లో దేశభక్తేది?
పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభంలో ప్రధాని మోదీ
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను అణచివేసింది
రైతులకు తీవ్ర నష్టం కలిగించింది
పాక్​ శక్తులతో కాంగ్రెస్​, ఎన్సీల దోస్తీ
తుక్డే తుక్డే​, నక్సల్స్​ విజృంభణకు ఈ పార్టీయే కారణం
విదేశాల్లో కూర్చొని దేశ విచ్ఛిన్నానికి కారణమవుతున్నారు
ముంబాయి: కాంగ్రెస్​ పార్టీలో దేశభక్తి స్ఫూర్తి చచ్చిపోయిందని, విదేశాల్లో కూర్చొని దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. హిందువుల అతిపెద్ద పండుగ గణపతి పూజపై కూడా విమర్శలు చేస్తుందని మోదీ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్​ పూర్తిగా అణిచివేసిందన్నారు. మహారాష్​ర్టలో రైతుల పేరుతో రాజకీయం చేస్తూ తీవ్ర నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ఆరోపించారు. 
 
శుక్రవారం మాహారాష్ర్టలోని వార్దాలో పీఎం విశ్వకర్మ యోజనను ప్రారంభించారు. ఈ పథకం కింద నైపుణ్య శిక్షణ పొందిన 8 లక్షల మంది శిక్షణ పొందారు. 75వేల మందిని ప్రధాని మోదీ రుణాలను మంజూరు చేశారు. పీఎం ఆచార్య చాణక్య స్కిల్​ డెవల్​ మెంట్​ సెంటర్​ పథకాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద 15 నుంచి 4 ఏళ్లలోపు యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. మహారాష్ర్టలోని 1.5 లక్షలమంది యువతకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు. 2023 ఆగస్ట్​ 15న ఎర్రకోట నుంచి పీఎం విశ్వకర్మ యోజనను ప్రకటించారు. 17 సెప్టెంబర్​ న పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 18 రకాల వ్యాపారాలు, కుల వృత్తులపై యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూ. 13వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోద ప్రసంగిస్తూ తాను గణపతి పూజ చేయడం కూడా కాంగ్రెస్​ కు నచ్చడం లేదన్నారు. కాంగ్రెస్​, మిత్రపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు అభివృద్ధి చెందొందని కుట్రలు పన్నాయని ఆరోపించారు. కానీ తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశ్యంతో ఉందని స్పష్టం చేశారు. విశ్వకర్మ ప్రయోజనాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని వర్గాలకు అందిస్తామన్నారు. 
 
దేశం పట్ల విశ్వాసం, నమ్మకం ఉన్న ఏ ఒక్కరూ గణపతి పూజపై వ్యాఖ్యలు చేయరని కానీ దేశ సంస్కృతి, సంప్రదాయాలను కూడా విచ్ఛిన్నం చేసేలా పూజపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్​ (బాబా)కే చెల్లిందన్నారు. దేశంలో అవినీతి, అక్రమాలకు కేరాఫ్​ కాంగ్రెస్​ పార్టీయే అన్నారు. తుక్డే తుక్డే గ్యాంగ్​, నక్సల్స్​ విజృంభించేందుకు ఈ పార్టీయే కారణమన్నారు. ఇలాంటి వారితో కలిసి విదేశాల్లో కూర్చొని తమ ఏజెండాను నడుపుతున్నారని ప్రధాని స్పష్టం చేశారు. పాక్​ మంత్రికి భారత అంతర్గత విధానంలో తలదూర్చే అధికారం ఏముందని ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్​, ఎన్సీ శత్రుదేశాల అభిప్రాయాలను కలిగి ఉన్నాయని స్పష్టం అవుతుందని మండిపడ్డారు. 
 
పీఎం విశ్వకర్మ..
వడ్రంగి, పడవల తయారీ, ఆయుధాల తయారీ, కమ్మరి, తాళాల మరమ్మత్తులు, ఇనుప పనిముట్లు, గోల్డ్​ స్మిత్​ లు, శిల్పులు, బుట్ట, చాప, చీపురు మేకర్​, బార్బర్​, మలాకర్​,టైలర్​, ఫిష్​ నెట్​ మేకర్​ లాంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తొలి దశలో 5 శాతం వడ్డీతో రూ. లక్ష రుణం ఇస్తున్నారు. అటు పిమ్మట దాన్ని రూ. 2 లక్షలకు పెంచుతారు. వారి వ్యాపార వృద్ధిని బట్టి క్రమేణా వీరి రుణ పరిమితిని కూడా పెంచనున్నారు.