అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
డిఇఓ రవీందర్ రెడ్డి
నా తెలంగాణ, నిర్మల్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే విధంగా బోధనను కొనసాగించాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఏ.రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. శనివారం ఆయన మామడ మండలంలోని పరిమండల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
తరగతి గదిలో బోధన తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలను రాబట్టారు. విద్యార్థులలో భాషా పఠన సామర్థ్యాలను పరిశీలించారు. ఎఫ్ఎల్ఎన్, లిప్ ప్రణాళిక ఆధారంగా పాఠ్యాంశాల బోధన కొనసాగించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. మధ్యాహ్న భోజనం అమలు తీరును ఏజెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత పాటిస్తూ రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు.