నా తెలంగాణ, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దక్షత చూసి యావత్ దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరడం శుభపరిణామన్నారు. మంగళవారం జూబ్లీ హిల్స్‌లోని కొండా నివాసంలో మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ కార్పొరేషన్‌కు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్, మీర్ పేట్ అధ్యక్షుడు పెండ్యాల నరసింహ, మహిళా మోర్చా అధ్యక్షురాలు, కార్పొరేటర్ లీలా రవి నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు వేముల నరసింహ, ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, జిల్లేల అరుణ ప్రభాకర్ రెడ్డి కో ఆప్షన్ సభ్యురాలు వేముల ఎల్లమ్మ, బీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు ఇంద్రావత్ రవి నాయక్, కోండ్రు గౌరీ శంకర్, కొంతం విజయలక్ష్మి రాజు, జ్యోతి కిషోర్ బీజేపీలో చేరారు.