లోయలో పడ్డ బీఎస్​ఎఫ్​ వాహనం

28మందికి తీవ్ర గాయాలు, ఒక జవాను మృతి

Sep 20, 2024 - 19:25
 0
లోయలో పడ్డ బీఎస్​ఎఫ్​ వాహనం

శ్రీనగర్​:  శ్రీనగర్​ లో బీఎస్​ఎఫ్​ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. రెండోదశ ఎన్నికల కోసం శుక్రవారం 36 మంది బీఎస్​ ఎఫ్​ జవాన్లతో కూడిన బస్సు బుద్గామ్​ లోని బిల్​ గ్రామంలో లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒక జవాను మృతి చెందగా, 28మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కొద్దిమంది సైనికుల పరిస్థితులు విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ఈ వాహనంతోపాటు మరో నాలుగు వాహనాలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాయి. వెంటనే స్పందించిన ఆ వాహనాల్లోని జవాన్లు సహాయక చర్యలను చేపట్టారు. గాయపడిన వారిని బుద్గామ్​ లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ వైద్యులకు సమాచారం అందజేసి ఆసుపత్రికి రప్పించి చికిత్సలందజేస్తున్నారు.