ట్రైనీ వైద్యురాలి ఘటనపై వైద్యుల ర్యాలీ
Doctors' rally on trainee doctor's incident
నా తెలంగాణ, నిర్మల్: పశ్చిమ బెంగాల్ లో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలో దోషులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం వైద్యులు, వైద్య సహాయక సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్యులపై ఇలాంటి ఘటనలు సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. ఇలాంటి ఘటనలు వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బ తీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, డాక్టర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై 24 గంటల పాటు సాధారణ వైద్య సేవలను వైద్యులు బహిష్కరించారు.