బహుభార్యత్వంపై నిషేధం యూసీసీ అమలు
ఎన్నికల తరువాత మీడియాతో చిట్ చాట్ లో సీఎం హిమంత బిశ్వ శర్మ
డిస్ఫూర్: ఎన్నికల తరువాత అసోంలో బహుభార్యాత్వాన్ని నిషేదిస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. యూసీసీని కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మీడియాత్ తో చిట్ చాట్ లో శనివారం ఉదయం శర్మ మాట్లాడారు. మదర్సాల ద్వారా ముస్లిం పిల్లలకు విద్యనందించడం వల్ల వారికి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. వారి పిల్లలు కూడా ఉన్నతంగా ఎదిగేలా విద్యను అందించాలన్నదే తమ అభిమతం అన్నారు. వారిని చీకట్లో పెట్టేలా మత, మూఢాచార విద్యలను అందిస్తున్నారని మండిపడ్డారు. ఎవరిని ఓట్లు అడగాలో, ఎవరిని అడగొద్దే అది తన స్వంత అభిప్రాయమని ఆ హక్కు తనకు ఉందని తెలిపారు. ఈశాన్య ప్రాంతంలోని 25 సీట్లలో బీజేపీ 22 సీట్లలో విజయం సాధిస్తుందని శర్మ తెలిపారు. ఇందులో 15 నుంచి 16 స్థానాలు బీజేపీ వస్తాయని మిగిలిన స్థానాలు ఎన్డీయ ఏకూటమి పార్టీలకు దక్కుతాయని అన్నారు. మోదీ అధికారంలోకొచ్చాక అన్ని ప్రభుత్వాల మాదిరేనని అందరూ భావించారన్నారు. కానీ ఈశాన్య ప్రాంతాలను దేశ రాజధాని తోనూ నేరుగా అనుసంధానించాక గానీ వారిలో నమ్మకం పెరగలేదన్నారు. అదే సమయంలో మారుమూల పల్లెలకు కూడా కేంద్రం సంక్షేమ ఫలాలు అందిస్తుండడంతో మోదీ మేనియా భారీగా పెరిగిందన్నారు.
ఇక వేర్పాటువాద నాయకులకు కాలం చెల్లిందన్నారు. అభివృద్ధి మంత్రంగా దూసుకుపోతున్న మోదీ కాలం వచ్చిందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం అవినీతి చేశానోనని రాహుల్ గాంధీ చెప్పాలని సవాల్ విసిరారు. ప్రధాని హ్యాట్రిక్ విజయంతో ఈశాన్య రాష్ట్రాల్లో మరిన్ని మెరుగైన ఫలితాలను చూడబోతున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో పాక్ కు లబ్ధి చేకూర్చేలా ఉందని సీఎం బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.