ఉగ్రవాదులకు సాయం ఆరుగురు అనుమానితుల అరెస్టు

ఒక జవాను వీరమరణం ఐదుగురికి చికిత్స రెండు రోజు కొనసాగుతున్న ఉగ్రవేట

May 5, 2024 - 12:39
 0
ఉగ్రవాదులకు సాయం ఆరుగురు అనుమానితుల అరెస్టు

కాశ్మీర్​ : ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారనే అనుమానం నేపథ్యంలో ఆరుగురిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. శనివారం సాయంత్రం పూంచ్​ లో వాయుసేన వాహనంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు గాయాలు కాగా, ఒక సైనికులు వీరమరణం పొందాడు. ఉగ్రవాదులకు పలువురు సహాయం చేస్తున్నారని గుర్తించిన పోలీసులు ఆరుగురిని ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గాయపడ్డ జవాన్లు ఉదంపూర్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు రెండోరోజు కూడా ఆపరేషన్​ కొనసాగిస్తున్నారు. షాసితార్​, గుర్సాయ్​, సనాయ్​, షింద్రా టాప్​ సహా పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు, పోలీసులు ఉగ్రవేట కొనసాగిస్తున్నారు. 
అంతకుముందు 2023 డిసెంబర్ 21న కూడా సూరన్‌కోట్‌లోని ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. ప్రస్తుతం జరిగిన కాల్పులు కూడా ఇదే తరహాలో చోటు చేసుకోవడంతో ఆ ఘటనకు దీనికి లింకు ఏమైనా ఉందా అనే కోణంలో భద్రతా దళాలు ఆరా తీస్తున్నాయి. కాగా దాడికి పాల్పడింది తామేనని పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఎఎఫ్​ఎఫ్​) బాధ్యత వహించింది. ఈ సంస్థ లష్కరే తోయిబా ఆధ్వర్యంలో దాడులకు పాల్పడుతోంది.